![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -653 లో...జ్యోత్స్నని కిడ్నాప్ చేసింది వైరా అని తెలిసి శివన్నారాయణ పట్టరాని కోపంతో గన్ తీసుకొని వెళ్తుంటే.. కార్తీక్ ఆపుతాడు. వాడిని చట్టపరంగా శిక్షించాలని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత పోలీసులు అక్కడ నుండి వెళ్తారు. ఇంట్లోకి వస్తే ఎక్కడ శివన్నారాయణ తిడతాడోనని పారు బయటే ఉండి శ్రీధర్ కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో పరుగున శ్రీధర్ ఇంటికి వస్తాడు. కార్తీక్ ఎలా ఉన్నావ్ రా ఇప్పుడే అత్తయ్య ఫోన్ చేసి జరిగింది చెప్పిందని శ్రీధర్ అంటాడు.
ఎందుకు ఇంత రిస్క్ చేశారు పోలీస్ మాత్రమే వెళ్లి ఉంటే డబ్బు అమ్మాయి క్షేమంగా ఇంటికి వచ్చేవి అని శివన్నారాయణ అంటాడు. తాత డబ్బులు అవి వాడి పాలు కాకుండా చాలా ట్రై చేశానని జ్యోత్స్న అంటుంది. మరొకవైపు డబ్బులు బ్యాగ్ చూస్తూ వైరా తన మేనేజర్ మురిసిపోతాడు. అప్పుడే బ్యాగ్ ఓపెన్ చేస్తారు.. అందులో ఇటుకలు ఉంటాయి అవి చూసి వైరా షాక్ అవుతాడు. మళ్ళీ ఆ కార్తీక్ మోసం చేసాడని అనుకుంటాడు. ఆ తర్వాత డబ్బులు మార్చమని అసలు డబ్బులు ఇవ్వని పారిజాతం డబ్బుల మూటని తీసుకొని వస్తుంది. అది చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. అసలు నిన్ను ఎక్కడ కిడ్నాప్ చేశారు జ్యోత్స్న అని కార్తీక్ అడుగుతుంటే.. ఇప్పుడు బావని డైవర్ట్ చేయపోతే ఇంకా డౌట్ వస్తుందని జ్యోత్స్న అనుకుంటుంది.
జరిగిందంతా ఒక కలలా మర్చిపోదాం బావ అని కార్తీక్ ని జ్యోత్స్న హగ్ చేసుకొని చాలా థాంక్స్ బావ అని అంటుంది. దాంతో అందరు ఆశ్చర్యంగా చూస్తారు. దీపకి కోపం వస్తుంది. కార్తీక్ ని హగ్ చేసుకొని దీప వంక జ్యోత్స్న పొగరుగా చూస్తుంది. ఆ తర్వాత కార్తీక్ ని తీసుకొని దీప ఇంటికి వెళ్తుంది. నువ్వు ఆ జ్యోత్స్నకి అడ్డువెళ్లడం ఏంట్రా అని కార్తీక్ పై కాంచన కోప్పడుతుంది. నీకు బుల్లెట్ తగిలిందని పారిజాతం అత్తయ్య చెప్పగానే నిన్ను చూసేవరకు టెన్షన్ అయిందని శ్రీధర్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |